పాఠశాలలోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో మధ్యాహ్న భోజన కార్మికురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం రామచంద్రాపురం ప్రభుత్వపాఠశాలలో సోమవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పంతంగి నరసింహారావు అతిగా మద్యం సేవించి ట్రాక్టర్‌ను నడుపుతున్నాడు. ఈ క్రమంలో అది అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పాఠశాలలోకి దూసుకెళ్లింది. వంటగది వద్ద పాత్రలు శుభ్రం చేస్తున్న లక్ష్మి(50) అక్కడికక్కడే మృతిచెందింది. మధ్యాహ్న భోజన విరామం కావడంతో విద్యార్థులంతా ఆరుబయట ఉండటంతో పెనుప్రమాదం తప్పింది.
బడిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్