జనరద్దీ లేని కోల్‌కతా నగరాన్ని తాను ఎప్పుడు కూడా చూడాల్సి వస్తుందనుకోలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. నా నగరాన్ని ఇలా చూస్తానని కలలో కూడా ఉహించలేదని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో నిర్మానుష్యంగా ఉన్న కోల్‌కతా వీదుల చిత్రాలను ట్విట్టర్‌లో గంగూలీ పోస్ట్ చేశారు . కరోనాను కట్టడి చేసేందుకు ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారిపై ఐక్యంగా పోరాడితే పరిస్థితి త్వరలోనే మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే భారత్‌లో కరోనా కేసుకు 500కు చేరుకోగా 10మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్ వైరస్ కారణంగా అంతర్జాతీయ క్రీడలన్ని వాయిదా పడగా..ఐపీఎల్‌ను సైతం బీసీసీఐ వాయిదా వేసింది
కోల్‌కతాను ఇలా చూడాల్సివస్తుందని అనుకోలేదు- గంగూలి